తాజా వార్తలు

Saturday, 21 November 2015

‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగులో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగులో భాగంగా ప్రస్తుతం గుజరాత్ లో ఉన్నారు. గుజరాత్ లోని వడోదరాలో పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొన్న దృశ్యాలు కొన్ని బయటకు వచ్చాయి. చుట్టూ సెక్యూరిటీ గార్డులతో పవన్ కళ్యాణ్ ఫోటోల్లో కనిపిస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే తరహాలో చుట్టూ సెక్యూరిటీ గార్డులతో కనిపిస్తారు. దీంతో ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా పవన్ కళ్యాణ్ లైఫ్ ఒకేలా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు చేస్తున్నారు.

‘సర్దార్ గబ్బర్‌సింగ్' అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సమ్మర్ కంటే ఓ నెల ముందే విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment