తాజా వార్తలు

Saturday, 7 November 2015

పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం పెంపు

పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.  అర్ధరాత్రి సమయంలో కేంద్రం లీటరు పెట్రోల్‌పై రూ.1.60, డీజిల్‌పై 40 పైసలు అదనంగా ఎక్సైజ్ సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంవత్సరంలో మిగతా కాలానికి రూ.3,200 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. తాజా పెంపుతో లీటర్ అన్ బ్రాండెడ్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.5.46 నుంచి రూ.7.06కు పెరగగా.. అన్ బ్రాండెడ్ డీజిల్‌పై సుంకం రూ.4.26 నుంచి రూ.4.66కు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఎక్సైజ్ సుంకం ద్వారా రూ.99,184 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికి ఈ వాటా రూ.33,042 కోట్లుగా ఉంది. ఎక్సైజ్ సుంకాన్ని పెంచినప్పటికీ.. బహిరంగ మార్కెట్లో మాత్రం వీటి విక్రయ ధరలు పెరగబోవని సంస్థలు స్పష్టం చేశాయి. సుంకం పెంపు భారాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలే భరించనున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment