తాజా వార్తలు

Friday, 27 November 2015

మోడీ వైఖరిలో మార్పు- సోనియా ,సింగ్ లతో చర్చలు

ప్రధాని మోడీ వైఖరిలో క్రమేపి మార్పు వస్తోంది. ఆయన విపక్షాలను కూడా కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాందీ, మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ లను చర్చలకు ఆహ్వానించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎమ్.వెంకయ్య నాయుడు చెప్పారు.పార్లమెంటులో పలు కీలకమైన బిల్లులను ఆమోదించడానికి గాను ప్రతిపక్షం సహకారం అవసరం.రాజ్యసభలో అదికార ఎన్.డి.ఎ. కి మెజార్టీ లేదు.దాంతో కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకోవడానికి బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగా మోడీ వారితో చర్చలు జరపనున్నారు.జి.ఎస్.టి.బిల్లుతో సహా 37 బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment