తాజా వార్తలు

Monday, 30 November 2015

ప్రపంచం ముందన్న అతి పెద్ద సవాల్

వాతావరణం ప్రస్తుతం ప్రపంచం ముందన్న అతి పెద్ద సవాల్ అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. పారీస్లో జరుగుతున్న కాప్-21 సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ ఎప్పుడూ సిద్థంగా ఉంటుందన్నారు. భవిష్యత్ను మార్చుకునేందుకు 196 దేశాలు కలిసి వచ్చాయి. సాంకేతిక సహా వనరులను పరస్పరం పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రధాని నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులపై ఆయనతో చర్చించారు. భూమిని, ప్రకృతిని కాపాడటమే భారత్ ధ్యేయమని, అందుకోసం అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. సౌరశక్తిని వినియోగిస్తున్న 121 దేశాలతో కలిపి ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. దాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment