తాజా వార్తలు

Saturday, 14 November 2015

యువ హీరో ప్రాణం తీసిన అక్రమ సంబంధం

అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపూర్ జిల్లా గుంతకల్ ప్రాంతానికి చెందిన సుందర్‌రాజ్ కుమారుడు బాల ప్రశాంత్(25) రెండేళ్లుగా కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని మూసాపేట్ అంజయ్యనగర్‌లో నివాసముంటున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు సినిమాలో హీరోగా చేశాడు. ఇదిలా ఉండగా అంజయ్యనగర్‌లో ఉంటున్న బాల ప్రశాంత్ వద్దకు పవర్‌నగర్, మాధవి మాన్‌షన్, ఫ్లాట్ నెంబరు 601లో నివాసం ఉంటున్న ఓ చిన్నారి డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చేది. ఈ క్రమంలో ఆమె తల్లితో ప్రశాంత్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రాత్రి ఆమె భర్త కంపెనీ పనిమీద ఊరికి వెళ్లాడు. దీంతో బాల ప్రశాంత్ ఆమెను కలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుంది. కాబట్టి తోడుగా ఉండమని ఒకరికి చెప్పాడు. ఇంటికి వెళ్లిన అతన్ని సదరు మహిళ తాను ఒక్కదాన్నే ఉంటాను పర్వాలేదని చెప్పి తిరిగి పంపించింది. ఇదే విషయాన్ని ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పాడు. అనుమానం వచ్చిన అతడు సమీపంలో ఉంటున్న తన సోదరికి సమాచారం అందించి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. తన వివాహేతర సంబంధం బయట పడుతుందని భావించిన ఆమె.. కత్తితో తన చేయి కోసుకుంది. తనతో పాటు ఉన్న బాల ప్రశాంత్‌ను ఇంట్లోని మంచం కింద దాచింది. తాను ఒక్కతే బయటికి వచ్చి తనను అనుమానించి అవమాన పరిచారని అందుకే చేయి కోసుకున్నానని కేకలు పెట్టింది. చేతి నుంచి తీవ్ర రక్తం వస్తుండటంతో వారు కూకట్‌పల్లిలోని ఓ ప్రవేటు దవాఖాను తరలించారు. దవాఖానలో వెళ్లే సమయంలో ఇంటికి తాళం వేశారు. ఆస్పత్రిలో ఉన్న సదరు మహిళ ఇంట్లో ఉన్న బాల ప్రశాంత్‌కు బయటి నుంచి తాళం ఉంది. నేను వస్తాను భయపడకు అంటూ ఎస్‌ఎంఎస్‌లు పంపించింది. భయంతో ఉన్న బాల ప్రశాంత్ తాను బాల్కాని నుంచి కిందికి దిగి వెళ్లి పోతున్నట్టు తిరిగి ఎస్‌ఎంఎస్ పంపాడు. 
ఈ క్రమంలో పెంట్ హౌజ్ బాల్కని నుంచి డ్రైనేజీ పైప్ సహాయంతో కిందికి దిగడానికి ప్రయత్నిసూజారి ఆరో అంతస్తు నుంచి కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు మృతదేహాన్నిదవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకట్ తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment