తాజా వార్తలు

Sunday, 15 November 2015

సల్లూ బాయ్ న్యూ రికార్డు

ప్రేమ్‌రతన్ ధన్‌పాయో చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు సాధించి.. సల్మాన్ గత సినిమా బజరంగీ భాయ్‌జాన్‌ రికార్డును అధిగమించింది. ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో తొలి రెండురోజుల్లో రూ. 71.38 కోట్లను వసూలు చేసినట్టు తెలిసింది. 2015 సంవత్సరంలో తొలిరెండురోజుల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఇంతకుమునుపు బజరంగీ భాయ్‌జాన్ చిత్రం రెండురోజుల్లో రూ. 63.75 కోట్ల వసూళ్లు రాబట్టింది. సినిమాకు మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ తొలిరోజు రికార్డుస్థాయిలో రూ. 40.35 కోట్లను వసూలు చేసింది. అయితే, రెండోరోజు ఈ సినిమా కలెక్షన్‌ 23శాతం పడిపోయింది. మొత్తానికి మూడు రోజుల్లో ఈ సినిమా వందకోట్ల మార్కును దాటే అవకాశముంది.
« PREV
NEXT »

No comments

Post a Comment