తాజా వార్తలు

Sunday, 29 November 2015

మకావు బ్యాడ్మింటన్ ఓపెన్ విజేత పీవీ సింధూ

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ మకావు బ్యాడ్మింటన్ ఓపెన్ విజేతగా నిలిచి మూడోసారి హాట్రిక్ నమోదు చేసుకుంది. జపాన్ షట్లర్ మినట్సు మితానీపై 21-9, 21-23, 21-14 తేడాతో సింధూ గెలిచింది. వరుసగా మూడో సారి టైటిల్‌ను సాధించిన పీవీ సింధూ. 2013, 2014లోనూ మకావు బ్యాడ్మింటన్ ఓపెన్ విజేతగా సింధూ నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధూ 21-8, 15-21, 21-16 తేడాతో జపాన్ షట్లర్ అకానె యామగుచిపై విజయం సాధించిన విషయం విదితమే.
« PREV
NEXT »

No comments

Post a Comment