తాజా వార్తలు

Saturday, 21 November 2015

రామ్‌దేవ్‌ బాబాకు కేంద్ర ఆరోగ్య భద్రత శాఖ నోటీసులు

యోగా గురు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి నూడిల్స్‌కు కేంద్ర ఆరోగ్య భద్రత శాఖ నోటీసులు జారీ చేసింది. ఇటీవల పతంజలి నూడిల్స్ ను రామ్ దేవ్ బాబా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే.. ఇన్‌స్టాంట్‌ ఆహార పదార్థాలను మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు వాటిని ఖచ్చితంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదించాల్సి ఉంది. కానీ పతంజలి నూడిల్స్ ఎటువంటి ఆమోదం లేకుండా మార్కె‌ట్‌లోకి చేరింది. విషయం ఆహార భద్రత శాఖ దృష్టికి రావడంతో పతంజలికి నోటీసులు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. దీంతో పతంజలి నూడిల్స్ పై బాబా ఏం సమాధానం ఇస్తారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment