తాజా వార్తలు

Monday, 2 November 2015

వంగవీటి హత్య ఎప్పటికీ మానని గాయమే....స్వర్గీయ వంగవీటి మోహన రంగాను అప్పటి ఎన్టీఆర్ నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం పాశవికంగా హత్య చేయించిందనే వాస్తవాన్ని చేగొండి హరి రామ జోగయ్య తన ఆత్మ కధలో వెల్లడించడాన్ని కులోన్మాదులు జీర్నిన్చుకోలేకపోతున్నారు.  కులోన్మాదుల గుండెల్లో మరోసారి రైళ్ళు పరిగెడుతున్నాయి.
ప్రజా నాయకుడైన రంగాకి అన్ని సామాజికవర్గాల్లో పెరుగుతున్న జనాదరణకు, కాపుల్లో వస్తున్న రాజకీయ చైతన్యానికి భయపడి, తమ సామాజికవర్గానికి రాజకీయంగా రంగా వలన ఎదురు దెబ్బ తగులుతున్దనే భయంతో చంద్రబాబు నాయుడు రంగాను చంపడానికి కుట్ర చేసారని చేగొండి చెప్పిన విషయం కొత్తదేమీ కాదు. అందరికీ తెలిసిందే.
ఈ రోజున కాపుల్లో కొంత మంది చవట, దద్దమ్మ , అమ్ముడుపోయి బానిసత్వం వహించే నోరు లేని నాయకులకు పదవులిచ్చి, వారి శాఖల్లోనూ  కుల నాయకుల, అధికారుల పెత్తనం మాత్రమె చెల్లే విధంగా బానిసలుగా చూస్తూ.... బయటికి మాత్రం మీకు ఇన్ని పదవులిచ్చామంటూ పదవుల సంఖ్యను వల్లే వేస్తూ .... ఆ సామాజికవర్గాన్ని మాటలతో మాయబుచ్చుతూ, పోలీసులతో భయపెడుతూ, మాట వినని అధికారులను బదిలీల రూపంలో, పనిష్మెంట్ల రూపంలో వేధిస్తూ, అక్రమ acb కేసులు పెట్టించి అణచి వేస్తూ చేస్తున్న అరాచకాలను పాపం కాపులు ఎన్నటికీ తెలుసుకోలేకపోతున్నారు.

మాకు ఇన్ని మంత్రి పదవులు వచ్చాయని చంకలు గుద్దుకుంటున్నారే గానీ వారికి ఆ శాఖలో పెత్తనం వుండదన్న విషయం తెలుసుకోలేని అమాయకత్వంలో మగ్గిపోతున్నారు. అలంకారమైన పదవులేనన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. పాపం జోగయ్య రంగా హత్యకు కుట్ర విషయం తెలిసిన వెంటనే బహిర్గతం చేసి వుంటే బాగుండేది. కనీసం జీవిత చరమంకంలోనన్నా వాస్తవాలను బయటపెట్టాడు.

గాలి ముద్దు కృష్ణమనాయుడు లాంటి విలువలు లేని , గాలి మాటలు మాట్లాడే నాయకులతో చేగొండిని విమర్శించినా వాస్తవం వాస్తం కాకుండాపోదు.
అంతే కాకుండా కొంతమంది అమ్ముదుపొఇన కాపు కుల , రాజకీయ నాయకులతో జోగయ్యమీద ఆరోపణలు చేయిస్తున్నాడు చంద్రబాబు.

ఎప్పుడైతే చేగొండి ఆత్మ కధలో రంగా హత్యకు బాబు పాత్ర వుందని వెల్లడిన్చాడో.... ఆ మరుసటి రోజే కాపులను మాయబుచ్చడానికి కాపు కార్పోరేషన్ కి 100 కోట్లు కేటైస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ పడేసాడు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాళా వద్దా అనే విషయం నిగ్గు తేల్చడానికి కోసం bc కమిషన్ ని ఏర్పాటు చేస్తున్నట్టు మరో మభ్యపెట్టే ప్రకటన. మరి సంవత్సరానికి వేయి క్ప్ట్ల చొప్పున ఇప్పటికి 2000 కోట్లు ఇవ్వాలి దాని విషయం మాట్లాడక పొఇనా గోర్రేల్లాంటి కాపులను ఎలా మాటలతో మోసం చేయొచ్చో కాపు నాయకులే చంద్రబాబుకి సలహాలు ఇస్తారని వినికిడి.

అమ్ముడుపోయే కాపు కుల, రాజకీయ నాయకులను కాపు యువకులు తరిమి కొట్టినప్పుడే కాపులు బాగుపడతారు.

బాబు తదుపరి కార్యక్రమం ఏమంటే.... కాపులకు దళితులకు, కాపులకు BC సామాజికవర్గాలకు మధ్య కుల చిచ్చు పెట్టి విభజించు పాలించు లాంటి బ్రిటిష్ వారి సిద్ధాంతాన్ని అమలు చేస్తాడు. ఈ విషయంలో కాపు,దళిత,BC యువత అప్రమత్తంగా వుండి.... సాటి ఇతర సమాజికవర్గ సోదరులతో సఖ్యతగా వుంటే రాజకీయంగా అందరికీ మేలు. లేదంటే పిట్ట పోరు ...పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు అవుతుంది.

కాపులకు ఇతర సామాజికవర్గాల వారి కన్నా కాపు నాయకులతోనే ప్రమాదం. వారు స్వార్ద ప్రయోజనాలకోసం, డబ్బుకోసం, పదవుల కోసం కాపు సామాజికవర్గాన్ని దుర్మాగుల చేతుల్లో పెట్టి నాశనం చేస్తున్నారు. రోజుకొక కుల నాయకుడు, రోజుకొక కుల సంఘం పెట్టి ఒక విజిటింగ్ కార్డు వేసుకుని వసూళ్లు చేసుకోవడం , లాబీయింగ్ చేసుకోవడం తప్ప పేద కాపులకు సేవ చెయ్యాలని ఏ కోశానా పని చెయ్యరు.
కాపులు ముఖ్యంగా కులాన్ని అమ్ముకుని బ్రతికే కాపు నాయకులను తరిమికొట్టాలి. నేను మీ కుల నాయకుడినని ఎవడన్న చెప్పుకుంటే........ ఎవడురా నిన్ను నాయకుడని చెప్పింది? అంటూ తరిమి తరిమి కొట్టండి


Editorial Desk
« PREV
NEXT »

No comments

Post a Comment