తాజా వార్తలు

Thursday, 26 November 2015

రష్యా, టర్కీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

రష్యా, టర్కీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతున్నది. రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఘటనలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని టర్కీ అధ్యక్షుడు ఎర్గోసన్ తెలిపారు. ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తమ గగనతల నిబంధనలు అతిక్రమించినందుకు రష్యానే క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందన్నారు. టర్కీ సైనిక బలగాలు, పైలట్ లు తమ విధిని సక్రమంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇది అవసరమైనటువంటి చర్యగా తాను భావిస్తున్నట్లు ఎర్గోసన్ అన్నారు.
తాము పలుమార్లు హెచ్చరించినా రష్యా పైలట్ లు స్పందించలేదన్న టర్కీ వాదనతో ఏకీభవించని రష్యా విమానం కూల్చివేతను సీరియస్ గా తీసుకుంది. టర్కీకి తగిన గుణపాఠం చెబుతామని ప్రకటించి ఆ దిశగా ముందుకు కదులుతోంది.  టర్కీ సరిహద్దులో గల సిరియాలోని రష్యా ఎయిర్ బేస్ లో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్ లను మోహరించింది. ఈ గొడువ ఎంత వరకు దారి తీస్తుందోనని విశ్లేషకులు భావిస్తున్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment