తాజా వార్తలు

Tuesday, 24 November 2015

రష్యా యుద్ధవిమానాన్ని కూల్చేసిన టర్కీ సేన

టర్కీ సేనలు సిరియా సరిహద్దులో సైనిక విమానాన్ని కూల్చివేశాయి. అది తమ దేశానికి చెందిన ఎస్యు-24 యుద్ధ విమానమని రష్యా తర్వాత ప్రకటించింది. మొదట అది దేశానికి చెందిన ఫ్లైటో తెలియరాలేదు. తర్వాత కొద్ది సేపటికి రష్యా.. విమానం తమదేనని తెలిపింది. యుద్ధ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లూ విమానం కూలిపోవడానికి ముందే పారాచూట్ల సాయంతో దూకేశారనివాళ్లలో ఒకరిని సిరియన్ తిరుగుబాటుదారులు పట్టుకున్నారని తెలుస్తోంది. విమానం కూల్చివేత విషయాన్ని టర్కీ మీడియా వర్గాలు వెల్లడించాయి.  పర్మిషన్ లేకుండా సిరియా బోర్డర్ మీదుగా తుర్కామెన్ పర్వతం సమీపానికి రాగానే విమానాన్ని కూల్చి వేసినట్లు సమయంలో దాని నుంచి ఫైర్ బాల్ కూడా పర్వతంపై పడినట్లు టర్కీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. మరోవైపు విమానం పేల్చివేతపై  రష్యా మండిపడుతోంది. ఇలాంటి ఇన్సిడెంట్లు మరోసారి జరిగితే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని రష్యా హెచ్చరించిందిరష్యా పైలట్లు ఎయిర్స్పేస్ను అతిక్రమించడం వల్లే తాము విమానాన్ని నేలకూల్చినట్లు టర్కీ మిలిటరీ అధికారులు తెలిపారు. సిరియా వైపున ఉన్న లటాకియా రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో యుద్ధ విమానం కూలుతున్న దృశ్యాలను కూడా అధికారులు విడుదల చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment