తాజా వార్తలు

Friday, 13 November 2015

ముగిసిన సదర్ పండుగ

హైదరాబాద్ లో సదర్‌ పండుగ గ్రాండ్ గా జరిగింది. యాదవ కులస్తులు పలు ప్రాంతాల్లో ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యువకులు చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సదర్‌ ఉత్సవాల కోసం దున్నపోతులపై యాదవులు ప్రత్యేక శ్రద్ద చూపించారు. వీటిని అందంగా ముస్తాబు చేయడంతో పాటు అనేక విన్యాసాలు నేర్పించారు. అందరినీ ఆకట్టుకునే విధంగా వీటిని తీర్చిదిద్దారు. అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణ కోసం వీటిని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. డప్పు దరువుల మధ్య విన్యాసాలు చేయిస్తూ ఊరేగింపు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో దున్నపోతుల విన్యాసాలు చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చారు. దీపావళి సందర్భంగా జరిగే ఈ వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. ఖైరతాబాద్‌లో జరిగిన ఉత్సవాల్లో సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్‌ పాల్గొన్నారు. నారాయణగూడలో జరిగిన సదర్‌ ముగింపు ఉత్సవాల్లో హోంమంత్రి నాయిని, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదర్‌ ఉత్సవాలను వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వమే నిర్వహించేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతామని మంత్రి నాయిని అన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment