తాజా వార్తలు

Sunday, 22 November 2015

మరోసారి గౌతమ్‌ మీనన్‌తో నాగచైతన్య

ఏమాయచేసావె గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నాగ చైతన్య మరో సినిమా చేస్తున్నాడు.  సినిమా టైటిల్  సాహసం శ్వాసగా సాగిపో అని ఖరారు చేశారు. ఈ సినిమాపై స్పందిస్తూ.. ఆల్‌మోస్ట్‌ పూర్తయింది. ఫస్ట్‌ హాఫ్‌ ఓ రోడ్‌ ట్రిప్‌లో జరిగే లవ్‌స్టోరీ. సెకండాఫ్‌ యాక్షన్‌కి వెళ్తుంది. ఈ యాక్షన్‌ చాలా నేచురల్‌గా వుంటుంది. హీరో క్యారెక్టర్‌కి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమాని బాగా డిజైన్‌ చేసారు. ఏమాయ చేసావె తర్వాత ఎ.ఆర్‌.రెహమాన్‌గారు నాకు మ్యూజిక్‌ చెయ్యడం వెరీ హ్యాపీ. మ్యూజిక్‌కి ఈ సినిమాకి చాలా పెద్ద ఎస్సెట్‌. పొయెటిక్‌గా టైటిల్స్‌ పెట్టే గౌతమ్‌ మీనన్‌గారు ఈ సినిమాకి పెట్టిన టైటిల్‌ అందరికీ నచ్చింది. సినిమా చూసాక సాహసం శ్వాసగా సాగిపో టైటిల్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ పర్‌ఫెక్ట్‌ అంటారు. కోన వెంకట్‌, రావి రవీంద్రరెడ్డి కాంప్రమైజ్‌ అవకుండా సినిమా చేస్తున్నారు. 
'ప్రేమమ్‌' కథ నాకు ఎంతో నచ్చింది! 
కార్తికేయ డైరెక్టర్‌ చందు మొండేటితో సినిమా చేద్దామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. నాకు కార్తికేయ బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను చందుతో ట్రావెల్‌ అవుతున్నాను. ఓ కథ కూడా అనుకున్నాము. ఈలోగా మలయాళంలో ప్రేమమ్‌ అనే లవ్‌స్టోరీ రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ అయింది. ఈ కథ నాకు బాగా నచ్చి రీమేక్‌ చేద్దామన్నాను. స్కూల్‌లో వున్నప్పుడు ప్రేమ, కాలేజీలో వున్నప్పడు ప్రేమ, మెచ్యూర్డ్‌ ఏజ్‌లో పెళ్ళి చేసుకున్నప్పుడు వుండే ప్రేమ.. వీటన్నింటి మధ్య వుండే వేరియేషన్‌ని హీరో క్యారెక్టర్‌ నుంచి చెప్పే అల్టిమేట్‌ లవ్‌స్టోరీ ఇది. లైఫ్‌ జర్నీలో ఈక్యారెక్టర్‌ మారే తీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే అనుభవాలు ఈ హీరో పాత్రలో వుంటాయి. ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో వంశీ, చందు మొండేటి చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు'' అన్నారు యువసామ్రాట్‌ నాగచైతన్య. 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి. ప్రసాద్‌ సమర్పణలో చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించే ఈ చిత్రాన్ని ఈనెల 28న మూహూర్తం చేసి డిసెంబర్‌ 3 నుండి వైజాగ్‌లో షెడ్యూల్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 
యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శృతిహాసన్‌తోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్‌ కాగా, మరో హీరోయిన్‌ ఎంపిక జరుగుతోంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment