తాజా వార్తలు

Saturday, 28 November 2015

సిద్ధార్థ- సమంత ట్విట్టర్ ఫైట్..

నువ్వులేక నేను లేను అంటూ ప్రేమగీతాలు పాడుకున్న జంట సిద్ధార్ధ..సమంత...! ఇప్పుడు అంతే ఘాటుగా ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. కొద్దిరోజుల్లో   వీళ్ల ఇళ్ల సందుల్లో  సన్నాయి మోగుతుందని అందరూ భావించారు. అందరి ఊహలకు తగ్గట్టే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజలు కూడా చేశారు. వీళ్లిద్దరి రహస్య ప్రేమాయణం....రాహు-కేతు పూజలతోనే బయటపడింది. అంతగా ప్రేమించుకున్న జంట..ఎందుకు విడిపోయిందో.. ఎలా విడిపోయిందో తెలియదు కానీ...ఇప్పుడు మాత్రం బద్ధశత్రువుల్లా ట్విట్టర్లో తిట్టుకుంటున్నారు.
నీకు జరిగిన చెడు అంతా నీ మంచికే జరిగిందని తెలుసుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అంటూ తాజాగా సిద్ధార్ద  ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.అయితే సమంత మాత్రం చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది. నువ్వొక పరిచయమే గుర్తులేనంతగా మామూలు వ్యక్తివని నేను భావిస్తున్నాను అంటూ సిద్ధార్థకు కౌంటర్ ఇచ్చింది సమంత. సమంత రిప్లై చూసినవారంతా అవాక్కవుతున్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీల్లో  సిద్ధార్ధ-సమంతల ట్వీట్ వార్పై పెద్ద చర్చే సాగుతోంది. అయితే సమంతా తాను పోస్ట్ చేసిన కామెంట్ను కొన్ని నిమిషాల్లోనే తీసేసింది. అయినా  అంత ఘాటుగా రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందా అంటూ ఇండస్ట్రీ గాసిప్ రాయుళ్లు తల గోక్కుంటున్నారు. ఇంతకూ సమంతకు గుర్తులేనంతగా సిద్ధార్ధ మారిపోవడానికి కారణమేంటబ్బా అన్నదానిపై ఆరా తీసేపనిలో పడ్డారు. సిద్దార్ధ-సమంత ఒకప్పటి మాజీ ప్రేమికులని అప్పట్లో ఫిల్మ్ నగర్ టాక్...
« PREV
NEXT »

No comments

Post a Comment