తాజా వార్తలు

Monday, 2 November 2015

సౌదీలో ఈ ఏడాది 142మందికి ఉరిశిక్ష

సౌదీ అరేబియాలో ఈ ఏడాది ఉరితీయబడిన వారి సంఖ్య 142కు చేరుకుందని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయమై సౌదీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఏడాది సౌదీ లో ఇప్పటివరకు హత్యలకు సంబంధించిన కేసుల్లో 142 మందిని ఉరితీశాం. 2014లో 87 మందిని ఉరితీశాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. సౌదీ అరేబియా నియమనిబంధనల ప్రకారం కత్తితో తలను నరికివేసి ఉరితీత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సౌదీ అరేబియా ఉరితీతను నిర్వహించడంలో గతేడాది ప్రపంచంలోనే మూడో స్థానాన్ని ఆక్రమించిందని లండన్‌కు చెందిన అమ్నేస్టీ ఇంటర్‌నేషనల్ కథనంలో వెల్లడించింది. ఈ విషయంలో చైనా,ఇరాన్ లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.  
« PREV
NEXT »

No comments

Post a Comment