తాజా వార్తలు

Friday, 27 November 2015

సైజ్ జీరో రివ్యూ

ఎన్నో హిట్ చిత్రాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం సైజ్ జీరో..   చిత్రంపై సాధారణంగా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు సొసైటీలో ఉన్న సైజ్ జీరో ట్రైండ్ కూడా  సినిమాపై ఆసక్తి పెంచేలా చేసిందిఅయితే ఇవన్నీ కథ ఎంత బలంగా ఉంది అనేదానిపై ఆధారపడి వర్కవుట్ అయ్యే విషయాలుస్టోరీ లైన్.... ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయిని వారి కుటుంబం విధంగా ట్రీట్చేస్తుంది. పెళ్లి వరకూ సన్నగా ఉండాలని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది అనేది క్లుప్తంగా చిత్ర కథాంశం.  
కథ..! చిన్నప్పటి నుంచి బొద్దుగా,లావుగా ఉండే సౌందర్య అలియాస్ స్వీటీ (అనుష్క)కు ఎన్ని సంభంధాలు వచ్చినా సెట్ అవ్వవు. ఆమె శరీర తీరే ఆమెకు అడ్డమవుతూంటుంది. అదే ప్రాసెస్ లో పెళ్లి చూపులకు వచ్చిన అభి(ఆర్య)తో పెళ్లి కుదరకపోయినా ఫ్రెండ్షిప్ కుదురుతుంది. అది స్నేహం నుంచి ప్రేమగా మారుతున్న సమయంలో అభి జీవితంలోకి సిమ్రాన్ (సోనాలి చౌహాన్) ఎంటరవుతుంది. దాంతో తన ప్రేమ సక్సెస్ కాదని అర్దం చేసుకున్న స్వీటీ ...ముందు తన లావు తగ్గించుకోవాలని ఫిక్స్ అవుతుంది. అందుకోసం సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) నడిపే సైజ్ జీరో సంస్ధ లో చేరుతుంది. అయితే అక్కడ వెయిట్ లాస్ పోగ్రామ్ లో ఇస్తున్న ఫుడ్, డ్రింక్స్ వల్ల కిడ్నీలు పాడవుతున్నాయిని తెలుసుకుని సంస్దపై యుద్దం ప్రకటిస్తుంది. అంతేకాదు...అప్పటికే అక్కడ చేరి ఆరోగ్యం పోగొట్టుకున్న స్నేహితురాలు జ్యోతి కు సాయిం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం స్వీటీ ఏం చేసింది. తను అనుకున్న లక్ష్యం చేరిందా...అభితో ప్రేమ వ్యవహారం ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
మొత్తానికి సైజ్ జీరో సినిమాలో బాహుబలి, రుద్రమదేవీలో కంటే అనుష్క బాగానే కనిపిస్తుంది ..

« PREV
NEXT »

No comments

Post a Comment