తాజా వార్తలు

Thursday, 26 November 2015

రాజ్యాంగ నిర్మాణంపై బీజేపీ మాట్లాడుతుందా..?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలుల ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో కంటికి కూడా కనిపించని పార్టీలు ఇప్పుడు రాజ్యాంగ రచన, లౌకికవాదం అంటూ మాట్లాడుతున్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. రాజ్యాంగ నిర్మాణ సమయంలో పాత్రా వహించని పార్టీలు రాజ్యాంగం నిర్దేశించిన ఆదర్శాలపై దాడి చేస్తున్నాయంటూ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. రాజ్యాంగ నిర్మాణ సమయంలో అందులో పాలు పంచుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేననీ, బీజేపీ సహా ప్రస్తుత పార్టీ కూడా ఆనాడు లేవని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన సందర్భంగా మొదటిరోజు ఆమె పార్లమెంట్ లో మాట్లాడారు.
రాజ్యాంగ నిర్మాణ సమయంలో మీరంతా ఎక్కడున్నారంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు. అప్పుడు లేని వాళ్ళంతా ఇప్పుడు లౌకికవాదం, ప్రజాస్వామ్యమంటూ మాట్లాడి రాజ్యాంగాన్ని అవహేళనకు గురిచేస్తున్నారని విమర్శించారు. గత కొద్ది నెలలుగా దేశంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను వెనకేసుకొస్తూ మాట్లాడుతున్న బీజేపీకి, తమకు ఎంతో తేడా ఉందన్నారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ సిద్ధాంతాలు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. తాము అధికారంలో ఉండగా ఏనాడూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, లౌకిక వాదాన్ని పూర్తిగా అనుసరించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.


« PREV
NEXT »

No comments

Post a Comment