తాజా వార్తలు

Monday, 2 November 2015

సామాన్యుడు మూడు పూటలా భోంచేసే పరిస్థితి లేదు- శ్రీకాంత్ రెడ్డి


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎంతసేపు జనం సొమ్ము తినాలని ఆలోచన చేస్తాడు తప్పితే, ప్రజలు ఏం తింటున్నారో ఏనాడు ఆలోచన చేయడని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సామాన్యుడు మూడు పూటలా భోంచేసే పరిస్థితి లేదని, నీరో లాంటి నారా చక్రవర్తి ధరలను అదుపు చేయడంపై ఏమాత్రం ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ  వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్ష విజయవంతం అయ్యిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తమ డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని  అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో సమర్పించినట్లు చెప్పారు. 
ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకోకుండా... ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరువల్లే ధరలు పెరుగుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.  కందిపప్పు కనీస మద్దతు ధర రూ.4300 ఉన్నా... రైతులకు గిట్టుబాటు కల్పించకుండా దళారులకు లబ్ది చేకూరుస్తోందని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  కందిపప్పు రూ.210, మినపప్పురూ. 190 ఎండుమిర్చీ రూ. 140.  ఇలా ధరలు భగ్గుమంటుంటే ఎలాంటి చర్యలు లేవని ఎత్తిపొడిచారు.  రైతుల మద్దతు ధర కోసం 5 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 1000 కోట్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి  చంద్రబాబు దాన్ని విస్మరించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల  కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చేపట్టారని శ్రీకాంత్ రెడ్డి ఈసందర్భంగా గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి  ఒక్కరిపై కూడా పన్నుల భారం మోపలేదన్నారు.  కానీ చంద్రబాబు అదికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆర్టీసీ, పవర్ ఛార్జీలు పెంచుతూ పన్నులు విధిస్తున్నాడన్నారు. పబ్లిసిటీ కోసం వేలకోట్లు ఖర్చు చేసే చంద్రబాబు ప్రజలకోసం మాత్రం ఎలాంటి ఆలోచన చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

« PREV
NEXT »

No comments

Post a Comment