తాజా వార్తలు

Sunday, 29 November 2015

సూర్య సినిమా కథ లీక్

ఈ మధ్య సినిమా పరిశ్రమకు పైరసీ భూతం ఓ పెద్ద సమస్య కాగా ,దీనిని నియంత్రించేందుకు కొందరు దర్శక నిర్మాతలు సరిక్రొత్త ప్లాన్స్ ను రూపొందిస్తున్నారు.కొందరు నిర్మాతలు తమ చిత్రాలను విడుదలైన పది రోజులకే ఆన్
లైన్ లో రిలీజ్ చేస్తుండగా,మరి కొందరు వినూత్న పద్దతిలో కలెక్షన్లను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే కోలీవుడ్ ప్రయోగాత్మక హీరో తన సినిమా కథను విడుదలకు ముందే చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.

సక్సెస్ లతో సంబంధం లేకుండా కేవలం ప్రయోగాత్మక చిత్రాలతో మంచి పాపులారిటీను పెంచుకున్న సూర్య తాజాగా మనం ఫేం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో 24 అనే మూవీని చేస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా ఇందులో సూర్య ఒక సైంటిస్ట్ గా,అతని కొడుకుగా మరియు ఆత్రేయ అనే విలన్ పాత్రలలో కనిపించి మెప్పించనున్నారు.అయితే కమర్షియల్ హీరోగా మంచి బ్లాక్ బస్టర్స్ సాధించిన సూర్య ప్రయోగాత్మక చిత్రాల ద్వారా ఆ స్థాయిని అందుకోలేకపోయారు.అందుకని 24 అనే ఎక్సపరీమెంట్ మూవీకు అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో ప్రేక్షకులు సూర్య సినిమాకు క్యూలు కడుతుండగా సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే ప్రేక్షకులు నిరాశకు గురవుతారు.ఇది భావించిన సూర్య ప్రేక్షకులు నిరాశకు గురి కావద్దని ముందు జాగ్రత్తగా 24 సినిమా కథను ముందే లీక్ చేశారు

24అనే చిత్రంలో మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్న సూర్య , టైం మిషన్ తరహలో వాచ్ తయారు చేసి దాని సహయంతో తన గతంలోకి వెళ్ళి చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు.ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే సినిమా కథ .ఇందులో సూర్య సరసన సమంత,నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment