తాజా వార్తలు

Thursday, 5 November 2015

టీ హబ్ అద్భుతం

టీ హబ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లో గ్రాండ్ జరిగింది. గచ్చిబౌలిలోని టీ హబ్ భవనం కాటలిస్ట్‌ను రాష్ట్రగవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి రతన్ టాటా ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.  టీ హబ్ అద్భుత నిర్మాణమని రతన్‌టాటా కొనియాడారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో యువతను ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్లతో భవనాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. కాటలిస్ట్ భవనాన్ని చూసిన తర్వాత దేశం కొత్త కోణం వైపు చొరవ తీసుకుంటున్నదనే భావన కలిగింది. ఎంటర్‌ప్రెన్యూర్లు, ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలకు ఇదో గొప్ప అవకాశం. ఇప్పటిదాకా దేశంలో దుకాణదారులు, పరిశ్రమలవారు, వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునేవారు వంటి సంప్రదాయ వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇపుడు అందుకు భిన్నంగా, సాంకేతికత ఆలంబనగా చేసుకుని భవిష్యత్తులో కీలక భూమిక పోషించగల ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం వచ్చింది. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ 17నెలల 4 రోజుల్లోనే స్టార్టప్‌ల కేంద్రాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మంత్రి కేటీఆర్ మదిలో రూపుదిద్దుకున్న టీ హబ్ గ్రేట్ ఐడియా. 
« PREV
NEXT »

No comments

Post a Comment