తాజా వార్తలు

Sunday, 29 November 2015

జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

టీ ఖరీదు ఐదు రూపాయలు ఉంటే ఒక రూపాయికి కిలో బియ్యం ఏమిటని అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి ప్రశ్నించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉద్దేశించిన ఈ పధకం ,ఇప్పుడు అందరికి వర్తింప చేస్తున్నారని, కప్పు టీ ఖరీదే ఐదు రూపాయలు ఉంటే బియ్యం ఖరీదు రూపాయా అని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ కూడా పరిమిత స్థాయిలో ఉండాలని ఆయన సూచించారు. ఉపాది హామీ పధకాన్ని వ్యవసాయానికి అనుసందానం చేస్తే ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు. దివాకరరెడ్డి వ్యాఖ్యలు సమంజసమైనవే . కాకపోతే ఎన్నికల ముందు ఇలాంటి విషయాలు చెప్పరు. ఎన్నికల మానిఫెస్టోలలో రూపాయికి కిలో బియ్యం ఇస్తామని చెప్పినప్పుడు మాట్లాడారు. అదికారంలోకి వచ్చాక మాట్లాడతారు. అదే చిక్కు.
« PREV
NEXT »

No comments

Post a Comment