తాజా వార్తలు

Tuesday, 24 November 2015

తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఎలక్షన్ కమీషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. హైదరాబాద్ మినహా 9జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో 12స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 2న ఎన్నికల నొటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు డిసెంబర్ 9చివరి తేదీ కాగా 10న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 12గా నిర్ణయించారు. డిసెంబర్ 27న ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 30న ఫలితాలు వెలువడనున్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  

« PREV
NEXT »

No comments

Post a Comment