తాజా వార్తలు

Saturday, 7 November 2015

త్వరలో తెలంగాణలో 9 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నియామకం చేపట్టనుంది. తెలంగాణలో దాదాపు 9 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోలీస్ శాఖలో 8,360 ఉద్యోగాలను, అగ్నిమాపక శాఖలో 510 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 5 కిలో మీటర్ల రన్నింగ్ రేస్ ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సివిల్ విభాగంలో మహిళలకు ఖచ్చితంగా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. 
 
« PREV
NEXT »

No comments

Post a Comment