తాజా వార్తలు

Tuesday, 24 November 2015

వరంగల్ లో టీఆరెస్ ప్రభంజనం

వరంగల్ ఉప ఎన్నికలో టీఆరెస్ దూసుకుపోయిందిఓరుగల్లు లోక్సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారురికార్డు ఓట్లతో టీఆరెస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలిచారు. ఉప ఎన్నికలో పసునూరి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. 4,59,092 ఓట్ల భారీ మెజార్టీతో పసునూరి గెలుపొందారుకాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్ఎస్ ఏకపక్షంగా గెలిస్తే.. ప్రతిపక్షాలు బంగాళాఖాతంలో కలిసిపోయాయి. తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అన్ని సెగ్మెంట్లలో టీఆర్ఎస్సే అత్యధిక మెజార్టీతో దూసుకుపోయింది. టీఆర్ఎస్ గెలుపుతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. పటాకులు పేల్చుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారువరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 1,56,315 ఓట్లు, బీజేపీ 1,30,178 ఓట్లు పోలయ్యాయి. అయితే డిపాజిట్లు దక్కాలంటే లక్షా 73 వేల ఓట్లు రావాలి. బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీ పడ్డాయి తప్ప.. కానీ కనీస పోటీని కూడా ఇవ్వలేదు. ఇక టీఆర్ఎస్కు 6,15,403 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,52,092 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ఎస్కు 60 శాతం ఓట్లు, కాంగ్రెస్కు 15 శాతం, బీజేపీకి 12 శాతం ఓట్లు పోలయ్యాయిగతంలోని సీఎం కేసీఆర్, డిప్యూటీ కడియం శ్రీహరి రికార్డును పసునూరి బ్రేక్ చేశారు
« PREV
NEXT »

No comments

Post a Comment