తాజా వార్తలు

Sunday, 22 November 2015

కమాండ్ కంట్రోల్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ శంకుస్థాపన ఘనంగా జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నిర్మించనున్న భవనానికి సీఎం కేసీఆర్ శాస్త్రోస్తంగా భూమి పూజ నిర్వహించారు.   కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, హనుమంతరావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని పోలీసు వ్యవస్థ ముందుకు పోవాలన్నారు. పోలీస్ కమాండ్, కంట్రోల్ కేంద్రం భవన నిర్మాణం కోసం ఇప్పటికే 302 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే బడ్జెట్లో మరో 700 కోట్లు మంజూరు చేస్తామన్నారు. సింగపూర్, చైనాను తలదన్నేలా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్.  
« PREV
NEXT »

No comments

Post a Comment