తాజా వార్తలు

Sunday, 29 November 2015

తెలుగులో విడుదల కానున్న చెర్రీ మెరుపు

గతంలో రామ్ చరణ్ మెరుపు అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ వేశాడు.అయితే ఈ చిత్రం ధరణి దర్శకత్వంలో పట్టాలెక్కగా కొంత కాలం తర్వాత ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.కాని ఆ టైటిల్ మాత్రం అప్పట్లో చాలా పాపులర్ అయింది.అయితే ఇప్పుడు ఇదే టైటిల్‌తో విజయ్ తన సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు .

తమిళ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో 59 వ సినిమాను చేస్తుండగా , ఈ చిత్రానికి తేరి అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్ ఇటీవల విజయ్ ఫేస్ బుక్ లో ప్రత్యక్షం కాగా వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రసుతం ఈ చిత్రం వడి వడిగా షూటింగ్ జరుపుకుంటుండగా తెలుగు వెర్షన్ రిలీజ్ కు ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం.అయితే తేరి చిత్రాన్ని తెలుగులో మెరుపు అనే టైటిల్ తో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు టాక్ .ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు.అయితే ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత,ఎమీ జాక్సన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment