తాజా వార్తలు

Sunday, 15 November 2015

వియజ్ కాంత్ అసహనం

డీఎండీకే పార్టీ అధ్యక్షుడు, తమిళ నటుడు విజయ్‌కాంత్ అసహనం పీక్ స్టేజీకి చేరింది. తన ప్రసంగానికి అడ్డు తగిలాడన్న కోపంతో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేపైనే చేయి చేసుకున్నాడు . తమిళనాడును ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తిన విషయం విదితమే. అయితే ఈ వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులను పరామర్శించడానికి స్థానిక కడలూరు జిల్లాలోని బన్‌రుట్టికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతున్న విజయ్‌కాంత్ స్థానిక నాయకుల పేర్లను తప్పుగా చదివారు. దీంతో ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే శివకుళందై దాన్ని సరిదిద్దే క్రమంలో విజయ్‌కాంత్ ప్రసంగానికి అడ్డు తగిలాడు. ఆగ్రహించిన విజయ్‌కాంత్ సదరు ఎమ్మెల్యే వీపు, తలపై కొట్టారు. విజయ్‌కాంత్ ఈ తరహాలో ప్రవర్తించడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇదే ఎమ్మెల్యే రెండు సార్లు దాడి చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  
« PREV
NEXT »

No comments

Post a Comment