తాజా వార్తలు

Saturday, 7 November 2015

రాష్ట్రానికి వర్ష సూచన


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. మరో 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో మరో రెండ్రోజుల్లో నెల్లూరు, ప్రకాశం, సహా రాయలసీమ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment