తాజా వార్తలు

Saturday, 21 November 2015

డ్యాన్స్ మాస్టర్ ప్రేమలో సింగర్ ప్రణవి..?

టాలీవుడ్‌లో చాలా మంది సింగర్స్‌ ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సింగర్ ప్రణవి కూడా ప్రేమ వివాహాం చేసుకోనుంది. ఇంతకీ ఆమె ప్రేమించింది ఎవరినో తెలుసా.. డ్యాన్స్ మాస్టర్ రఘు మాష్టర్‌ని. వీరిద్దరి వ్యవహారాన్ని నాగశౌర్య హీరోగా నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ ఆడియో ఫంక్షన్లో యాంకర్ ఝాన్సీ బయటపెట్టింది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న వీరు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారు.

‘ఆర్య-2′, ‘మిర్చి’, ‘జిల్‌’, ‘అఖిల్’.. ఇలా టాలీవుడ్‌లో పలు భారీ చిత్రాలకు రఘు మాష్టర్ కొరియోగ్రఫీ చేశారు. మిర్చి లో ‘ఇదేదో బాగుందో మది’ సాంగ్‌ ను కొరియోగ్రాఫ్ చేసింది రఘు మాష్టరే. పలు రియాల్టీ షోలకు కూడా రఘు మాష్టర్ జడ్జిగా వ్యవహరించారు. ఇక, ప్రణవి.. ’శ్రీరామదాసు’, ‘హ్యాపీ డేస్‌’, ‘యమదొంగ’, ‘లయన్’ లాంటి చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు పాడింది. ఏదైతేనేం.. స్వరం, నాట్యం త్వరలో ఏకమవుతున్నాయన్నమాట..!
« PREV
NEXT »

No comments

Post a Comment