తాజా వార్తలు

Thursday, 19 November 2015

ముగిసిన వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం

ఓరుగల్లులో ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. వైఎస్సార్సీపీకి జిల్లాలో అపూర్వ స్పందన లభించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు వరంగల్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ గెలుపే లక్ష్యంగా వైఎస్ జగన్ జిల్లాలో నాలుగు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వులు చిందిస్తూ ఆత్మీయంగా నమస్కరిస్తూ..వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 
ఊరువాడ అంతా ఏకమై ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్ కు నీరాజనం పట్టారు. రాజన్న బిడ్డను చూసి పులకించిపోయారు. గ్రామాలు, పట్టణాల్లో రహదారి పొడవునా రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో వైెస్ జగన్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. తొర్రూరు, పరకాల, హన్మకొండ, స్టేషన్ ఘన్ పూర్ లలో బహిరంగసభల్లో పాల్గొని వైఎస్సార్సీపీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లాలో పాలకుర్తి నుంచి మొదలైన వైఎస్ జగన్ ప్రచారం స్టేషన్ ఘన్ పూర్ వరకు వందల కి.మీ. మేర సాగింది. అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాజశేఖరుడి బిడ్డ జగన్ ను ప్రజలు బోనాలు, బతుకమ్మలు, డప్పు వాయిద్యాలతో ఆత్మీయంగా ఆహ్వానించారు. బొట్టు పెట్టి, హారతులిచ్చి గెలుపు దీవెనలు అందించారు. రాజన్న కలల రాజ్యాన్ని  తెచ్చుకుందామని...వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని ఆశీర్వదించారు. తమ బతుకులు బంగారుమయం కావాలంటే రాజన్న ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించారు. వైఎస్సార్సీపీని గెలిపించాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. వరంగల్ లో నల్లా సూర్యప్రకాష్ గెలుపు బావుటా ఎగరవేస్తారని, వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment