తాజా వార్తలు

Saturday, 21 November 2015

ప్రశాంతంగా వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్

వరంగల్ లోక్సభ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్లాల్. పోలింగ్ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. మొత్తం 68.59 శాతం పోలింగ్ నమోదైందన్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. వరంగల్  వెస్ట్ లో 50శాతం కూడా పోలింగ్  కాలేదు. స్టేషన్ఘన్పూర్-75.55 శాతం, పాలకుర్తి-76.51శాతం, పరకాల-76.69శాతం, వరంగల్ వెస్ట్-48.03శాతం,  వరంగల్ ఈస్ట్-62.21శాతం, వర్థన్నపేట-71.16శాతం,  భూపాలపల్లి-7010 శాతం ఓటింగ్ నమోదైందిఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ వాటిని పోలీసులు వెంటనే అదుపులోకి తెచ్చారు. పోలింగ్లో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని భన్వర్లాల్ తెలిపారు. కొన్ని చోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని.. అక్కడ వెంటనే కొత్త వాటిని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. మొత్తం ఏడు చోట్ల ఈవీఎంలను మార్చినట్లు చెప్పారు
ప్రజాస్వామ్య ప్రక్రియలో వరంగల్ లోక్సభ ఓటర్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగియగానే సీఎం ప్రకటన చేశారు. ఉప ఎన్నిక అయినప్పటికీ ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఓటింగ్కు తరలి రావడం, పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్లో వేచి ఉండటం అభినందనీయమన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకున్నారని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన అధికారులకు, భద్రతా సిబ్బందిని ఆయన అభినందించారు

« PREV
NEXT »

No comments

Post a Comment