తాజా వార్తలు

Friday, 27 November 2015

కొట్టిందనే అవమానంతో భార్యను హత్య చేసిన భర్త

ఫ్లోరిడాలో దారుణం జరిగింది. భార్య చేయిచేసుకుందనే కోపం, అవమానంతో కిరాతకంగా హత్య చేశాడో కిరాతకుడు. డెరెక్ మెడీనా తన వైఫ్  జెన్నిఫర్ ఆల్ఫోన్సోతో తరచు గొడవపడేవాడు.  ఇటీవలే గొడవలో జెన్నిఫర్, డెరెక్పై చేయిచేసుకుంది. దీంతో అవమానం భరించలేని డెరెక్ ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం రక్తపు మడుగులో ఉన్న జెన్నిఫర్ మృతదేహాన్ని ఫొటోలు తీసి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. నాభార్య నాపై చేయిచేసుకుంది.. అవమానంతో నేను ఆమె ముందు నిలబడలేను. అందుకే చంపేశా అంటూ పోస్టు చేశాడు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో డెరెక్ను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారుడెరెక్ను దోషిగా నిర్ధారించి.. స్థానిక న్యాయస్థానం అతడికి 25ఏళ్ల జైలుశిక్ష విధించింది.   
« PREV
NEXT »

No comments

Post a Comment