తాజా వార్తలు

Sunday, 29 November 2015

అమరావతి బోర్డు ఇంగ్లీష్ లో రాస్తారా?

తెలుగు భాషోద్యమ నేత, మాజీ ఎమ్.పి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎపి రాజదాని అమరావతి శంకుస్థాపన ఫలకాన్ని తెలుగులో కాకుండా ఆంగ్లంలో రాశారని, సంబందిత అదికారులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపిలో తెలుగు యూనివర్శిటీని స్థాపించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాజమండ్రిలో తెలుగు యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని, అయినా అదికారులు చర్యలు తీసుకోవడం లేదని ,పదో షెడ్యూల్ లో ఉందని చెబుతున్నారని అన్నారు. ఎన్.జి.రంగా యూనివర్శటీ కూడా పదో షెడ్యూల్ లో ఉన్నా ఎలా శంకుస్థాపన చేశారని అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తెలుగు పీఠాలకు నిదులు ఇవ్వకుండా జాప్యం చేయడం,ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం పై ఆయన మండిపడుతూ అదికారులపై చర్య అయినా తీసుకోవాలి, లేదా మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని లక్ష్మీప్రసాద్ సూచించారు.అమరావతి బోర్డు ఇంగ్లీష్ లో రాసినందుకు కలెక్టర్ పై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. ప్రధాని మోడీకి అర్దం కావడం కోసం ఇగ్లీష్ లో రాశారేమో!
« PREV
NEXT »

No comments

Post a Comment