తాజా వార్తలు

Sunday, 1 November 2015

నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణ చేయండి-వైఎస్సార్ సీపీ

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన నిత్యావసరాల ధరలపై వైఎస్సార్ సీపీ సమరభేరి మోగించింది. ధరలు తగ్గేలా చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా అధినేత జగన్ పిలుపుతో నేడు ఏపీలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టనుంది. పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపి ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్సార్ సీపీ కోరింది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌రల పెరుగుద‌ల‌ను నియంత్రిచ‌డంలో చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని ప్రతిప‌క్ష పార్టీ  వైసీపీ మండిప‌డుతోంది. ఎన్నిక‌ల ముందు ఎలాంటి ప‌న్నులూ విధించ‌మ‌ని... ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామ‌న్న హామీల్ని తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు నిర‌స‌న‌గా నేడు రాష్ట్రంలోని అన్ని త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల ముందు ధ‌ర్నాలు చేసి... ఎమ్మార్వోల‌కు మెమోరాండం సమర్పించనుంది.  స‌మ‌ర్పిస్తామ‌ని ప్రకటించింది. రైతుల‌కు స‌కాలంలో సాగునీరు స‌ర‌ఫ‌రా చేయ‌క‌పోవ‌డంతో పంట‌లు ఎండిపోతున్నాయ‌ని YCP ఆరోపిస్తోంది. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎక‌రాకూ సాగునీరు అందిస్తామ‌ని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు అద‌నంగా మ‌రో రెండు ల‌క్షల ఎక‌రాల్లో పంట‌లు వేశారని, అయితే ప్రభుత్వం ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోవ‌డంతో దాదాపు 10 ల‌క్షల ఎక‌రాల్లో పొట్ట ద‌శ‌లో ఉన్న పంట‌లు ఎండిపోయే ప‌రిస్ధితి నెల‌కొంద‌ని YCP అంటోంది. కృష్ణా డెల్టా ప్రాంతంలో ఎండిపోతున్న పంటల్ని పరిశీలించడానికి... 3, 4న YCP బృందం ఆ ప్రాంతంలో పర్యటిస్తుందని ప్రకటించింది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం త్వర‌లో భూసేకర‌ణ నోటిఫికేష‌న్ ఇవ్వనుండ‌టంతో... రైతుల ప‌క్షాన పోరాడేందుకు కూడా YCP సిద్దమౌతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment