తాజా వార్తలు

Monday, 23 November 2015

పాలమూరులో బీజేపీకి ఎదురుదెబ్బ

మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీకీ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. తన రాజకీయ భవిష్యత్ కార్యచరణ త్వరలోనే వెల్లడిస్తానని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దివంగత రాజేశ్వర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరఫున యెన్నం గెలుపొందారు. ఆ తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కొద్ది రోజులుగా యెన్నం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యమ్నయాలు కాలేవన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడినవారు ఇంకా చాలామంది కేసుల నుంచి విముక్తి కాలేదన్నారు. కోర్టుల చుట్టూ తిరుతూ ఇబ్బందులెదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment