తాజా వార్తలు

Tuesday, 22 December 2015

బాలనేరస్తుల వయస్సు 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కుదింపు

బాలనేరస్తుల వయస్సు 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కుదించారు. దీనిపై జువెనైల్ జస్టిస్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఆమోదం లభించింది. మైనర్ బాలనేరస్తుల వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించారు. బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఇదివరకే ఆమోదించింది. తాజాగా రాజ్యసభలో ఆమోదం లభించడంతో రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశాక బిల్లు అమల్లోకి రానుంది. జువెనైల్ జస్టిస్ బిల్లుపై చర్చ సందర్భంగా నిర్భయ తల్లిదండ్రులు కూడా సభకు వచ్చారు. విజిటర్స్ గ్యాలరీలో ఉండి చర్చను విన్నారు. అయితే.. బిల్లు పాసవడం ఆనందంగా ఉన్నా.. తన కూతురికి న్యాయం జరగకపోవడం బాధగా ఉందన్నారు నిర్భయ తల్లి ఆశాదేవి.  
« PREV
NEXT »

No comments

Post a Comment