తాజా వార్తలు

Friday, 4 December 2015

రోడ్డు వెడల్పు కోసం అర ఎకరం అన్నపూర్ణ స్టూడియో స్థలం


అన్నపూర్ణ స్టూడియో స్థలం రోడ్డు వెడల్పులో పోతున్నది.   అర ఎకరం భూమిని రోడ్లు వెడల్పు చేయడం కోసం కేసీఆర్ తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తున్నది. భూమిని ఇవ్వడానికి మొదట నాగార్జున ఫ్యామిలీ నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ఖైరతాబాద్ ఎమ్మెల్సీ రామచంద్రరావు, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి అన్నపూర్ణ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. దీంతో వారు భూమిని ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ అర ఎకరం భూమి కోసం ప్రభుత్వం పరిహారం ఇవ్వనున్నది. కానీ పరిహారం నగదు రూపంగానా.. లేక అభివృద్ది హక్కు ఇవ్వాలనే అనే ఆలోచనలో ఉంది. బంజరా హిల్స్ రోడ్ నెం. 2 నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెం. 5 వరకు కృష్ణా నగర్ జంక్షన్ వరకూ రోడ్డు వెడల్పు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. వీటికి మధ్యలో అన్నపూర్ణ స్టూడియో ఉంది. నేపద్యంలో అన్నపూర్ణ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ సుప్రియ మాట్లాడుతూ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి భూమి ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని.. కానీ తమ నిర్మాణాల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నది. దీంతో ప్రభుత్వం మెరుగైన పద్దతుల్లో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment