తాజా వార్తలు

Friday, 25 December 2015

అసెంబ్లీని సొంతానికి వాడుకుంటారా..

ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మీద బురద జల్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ గా నిలిచే అసెంబ్లీని తన స్వార్థం కోసం ఉపయోగించుకొంటున్నారు. దీంతో పలు వివాదాలకు అసెంబ్లీ పాలన యంత్రాంగం కేంద్ర బిందువుగా నిలవాల్సి రావటం దురద్రష్టకరం. అసెంబ్లీ లో కొందరు ప్రతిపక్ష సభ్యుల స్పీకర్ కు తమ మొర వినిపించుకొంటున్నప్పటికి సంబంధించిన వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. ఆవేదనను తెలియపరిచే సమయంలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు అంటూ వారిపై విషం చిమ్మే ప్రయత్నం జరిగింది. ఈ వీడియోలను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విడుదల చేశారు. పూర్వాశ్రమంలో సీనియర్ పాత్రికేయులుగా పనిచేసి తర్వాత రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న శ్రీనివాసులు అసెంబ్లీ పట్ల వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయింది. వీడియోలు విడుదల చేస్తూ వీటిని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అనుమతి తో విడుదల చేస్తున్నట్లు స్వయంగా చెప్పారు.
కానీ తర్వాత రోజు మీడియాతో మాట్లాడిన స్పీకర్ ..క్లిప్పింగ్ ల విడుదలకు, తనకు సంబంధం లేదని చెప్పారు. అసలు వాటిని ఎవరు విడుదల చేశారో తెలుసుకొనే ప్రయత్నం చేస్తానని  చెప్పారు. అంతలోనే చీఫ్ విప్ కాల్వ మాట మార్చి స్పీకర్ కు దీంతో సంబంధం లేదని కొట్టిపారేశారు.
అసలు ఈ తతంగం అంతా ఎందుకు నడుస్తోంది అన్న మాట వినిపిస్తోంది. అసలు అసెంబ్లీ లో జరగుతున్న కార్యకలాపాల్ని కొంచెం కొంచెంగా ఎడిట్ చేసి ఇవ్వటం ఎటువంటి సాంప్రదాయం. మొత్తం ప్రొసీడింగ్స్ ను బయటకు ఇస్తే అసలు వాస్తవాలు బయట పడతాయి కదా. అసలు అధికార పక్ష సభ్యులు ఎటువంటి తిట్లు తిడుతున్నారు. ఎటువంటి భాష వాడుతున్నారు అనేది తెలిసిపోతుంది కదా. అదేమీ లేకుండా కొంత భాగాన్ని ఎడిట్ చేసి విడుదల చేయటంలోని ఆంతర్యం ఏమిటి..
అసెంబ్లీ అన్నది అందరికీ సంబంధించినది అయినప్పుడు అక్కడ నుంచి విడుదల అయ్యేవి పారదర్శకంగా ఉంటే బాగుంటుంది. కేవలం అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న క్లిప్పింగ్ లు మాత్రమే విడుదల అవటం అసెంబ్లీ యంత్రాంగాన్ని విమర్శలకు కేంద్రంగా మారుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరాక ఈ రకంగా వీడియోలు విడుదల చేయటం రెండోసారి. అటువంటప్పుడు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అనదగ్గ అసెంబ్లీ వ్యవస్థను చంద్రబాబు తన స్వార్థం కోసం వాడుకొంటున్నారు అనే చెప్పవచ్చు. 
« PREV
NEXT »

No comments

Post a Comment