తాజా వార్తలు

Wednesday, 9 December 2015

ఢిల్లీలో ఇద్దరు చంద్రులు కలుస్తారా ??

ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన సాధారణమే అయినా.. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ఒకేసారి ఢిల్లీలో పర్యటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టడంతో.. ఒక్కసారి తెలుగు రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్‌ అయ్యింది. సీఎం కేసీఆర్ నిన్ననే దేశ రాజధానికి చేరుకోగా, చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి చేరుకుంటారు.

అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొనేందుకు ఇద్దరు నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు. పనిలో పనిగా ఇతర  అంశాలను , పెండింగ్ ప్రాజెక్టులపైనా దృష్టిసారిస్తున్నారు. సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో పాటు పర్యాటక శాఖ మంత్రితోనూ భేటీ అయి వివిధ అంశాలపై చర్చించనున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రభుత్వ పెద్దలను చంద్రబాబు కలిసే అవకాశముంది.

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు. ఇద్దరూ ఒకే సారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణ్ జైట్లీ కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన కేంద్రమంత్రులను వేర్వేరుగా కలవనున్నారు.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ పలువురు కేంద్రమంత్రులను కలుస్తారు. రేపు ఎన్‌సీపీ నేత శరద్‌పవార్ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. రేపు రాత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకుంటారు.
« PREV
NEXT »

No comments

Post a Comment