తాజా వార్తలు

Wednesday, 2 December 2015

భారత్ లో ముస్లిం కన్నా ఆవుకే ఎక్కువ రక్షణ

కాంగ్రెస్ ఎమ్.పి శశిధరూర్ వ్యాఖ్య సీరియస్ గానే కనిపిస్తుంది.భారత్ లో ముస్లిం కన్నా ఆవుకు రక్షణ ఎక్కువగా ఉందని బంగ్లాదేశ్ స్నేహితుడు ఒకరు వ్యాఖ్యానించినట్లు ఆయన చెప్పారు.లోక్ సభలో అసహనంపై ఆయన మాట్లాడుతూ బంగ్లదేశ్ లో ఇస్లామిక్ మతవాదులు భారత్ పై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారని, భారత్ లో ముస్లిం కన్నా ఆవు ఎక్కువ రక్షితంగా ఉంటుందని భావిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని ఆ స్నేహితుడు చెప్పారని అన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతే అభివృద్ది ఎలా సాధ్యం అని ఆయన అన్నారు. ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా ప్రచారం చేస్తున్నా ,మరో వైపు ద్వేష భావాల వ్యాప్తి నష్టం కలుగ చేస్తోందని ఆయన అన్నారు.నిజానికి బంగ్లాదేశ్ మిత్రుడు చెప్పినదానిలో ఎంతవరకు వాస్తవం ఉందో ఆలోచించాలి.పలు ముస్లిం దేశాలలో జరుగుతున్న ఘోర కలిగురించి ఆ స్నేహితుడు బాధ పడి ఉంటే బాగుండేది.భారత్ లో కొంత అసహనం ఉండవచ్చు .కాని మరి ఆవుతో పోల్చవలసినంత కాదు కదా!
« PREV
NEXT »

No comments

Post a Comment