తాజా వార్తలు

Thursday, 3 December 2015

అఖిల్ డ్యాన్స్ ను లైవ్ లో చూస్తారా?!

అక్కినేని మూడో తరం వారసుడిగా అభిమానులలో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకున్న అఖిల్, లైవ్ లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చేసేందుకు రెడీ అయ్యారు.వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన అఖిల్ మూవీలో తన యాక్షన్,డ్యాన్స్ లతో అలరించిన సిసింద్రీ ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.దీనికి వేదికగా ఐఫా అవార్డుల కార్యక్రమాన్ని అఖిల్ ఎంచుకున్నాడు . ఇండియాలో అత్యంత వైభవంగా జరిగే అవార్డులలో ఐఫా ( ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమి ) అవార్డ్స్ ఒకటి. ఈ ఐఫా వేడుకలను ప్రతీ సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరపనుండగా, మొదటి సారి సౌత్ లో ఐఫా అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ ఫస్ట్ సౌత్ ఇండియన్ అవార్డ్స్ వేడుకని డిసెంబర్ 5,6 వ తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించనుండగా, ఈ వేడుకకు అల్లు శిరీష్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సౌత్ ఇండియన్ సినిమాలకు సంబంధించి జరిగే ఈ ఐఫా అవార్డుల కార్యక్రమంలో సౌత్ భాషకు చెందిన పలువురు నటీ నటులు పాల్గొననుండగా,ఈ వేడుకలో రామ్ చరణ్ స్పెషల్ డ్యాన్స్ వేయనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే వేడుకలో ఆడియన్స్ ని తన డ్యాన్స్ లతో ఉర్రూతలూగించేందుకు అఖిల్ కూడా సిద్దమవుతున్నాడు. ఐఫా ఉత్సవమ్ లో తెలుగు అవార్డ్స్ రోజున అఖిల్ పర్ ఫార్మెన్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అఖిల్ ఇప్పటికే పాపులర్ కొరియోగ్రాఫర్ దగ్గర ట్రైన్ అవుతున్నట్టు టాక్ .
« PREV
NEXT »

No comments

Post a Comment