తాజా వార్తలు

Wednesday, 2 December 2015

అత్యంత క్రూరమైన సైకో రేపిస్ట్.. 20 ఏళ్లుగా అత్యాచారం!

అత్యంత క్రూరమైన సైకో రేపిస్ట్. మహిళపై అత్యాచారం చేసి అనంతరం పట్టకారులతో ఆమె నోట్లోని పళ్లనీ పీకేసి అద్దం ముందు పెట్టి నవ్వమన్నాడు. గర్భంతో ఉన్న ఓ మహిళపై దారుణంగా అత్యాచారం చేశారు. 20 ఏళ్లుగా అత్యాచారాలు చేస్తూ చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. 

క్రూరమైన రేపిస్ట్(న్యాయస్థానం ఉపయోగించిన పదం) డొనాల్డ్ జెఫ్రే(45) ఐదు అత్యాచారాలు, 6 దారుణ దాడులు, ఓ హత్యాయత్నం, దారుణమైన దాడి ఇవి అతనిపై ఆరోపించిన నేరాలు. అయితే ఇంతకన్నా ఎంతో దారుణాలు చేసినా వాటికి మాత్రం సరైన ఆధారాలు దొరకలేదు. ఇతని బాధితుల్లో 20 ఏళ్లుగా నరకం అనుభవించిన మహిళలు ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ ఇతని భాగస్వాములు. రెండో బాధితురానిని జెఫ్రె దారుణంగా హింసించి ఆమె పళ్లు పీకేసి హత్యకు కూడా ప్రయత్నిం చేశాడు. ఆ మహిళకు అద్దం ఇచ్చి అందులో తనను తాను చూసుకుని చెడుగా కామెంట్స్ చేయమని చావబాదాడు. సుత్తి తీసుకుని తీవ్రంగా హింసించాడు. బాత్రూంలో వాటర్ టబ్‌లో ముంచి హత్య చేసేందుకు యత్నించాడు. ఇవి అతని నేరాల్లో చాలా తక్కువ మాత్రమే. ఎట్టకేలకు ఎన్నో సంవత్సరాల అనంతరం పోలీసులకు చిక్కాడు. విచారణ అనంతరం న్యాయమూర్తి సైతం నీ నుండి సామాన్యులను రక్షించేందుకు నువ్వు చనిపోయే వరకు జైలులోనే గడపే విధంగా శిక్ష విధిస్తున్నా అని తీర్పు నిచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment