తాజా వార్తలు

Sunday, 13 December 2015

కాల్ మనీ కేసులో కొత్త మలుపు

ఏపీ పోలీస్  శాఖ  కాల్ మనీ కేసులో కీలక నిందితులైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో యలమంచిలి రాము, దూడల రాజేష్‌‌లు ఉన్నారు. నిందితులపై 420, 376, 354(1)(2), 384, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కేసు నమోదైందికాలమనీ కేసును సర్కార్ సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోందిజయవాడ టాస్క్ ఫోర్స్ దాడి చేసి ఈముఠాకు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము, భవానీ శంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, ఎం సత్యానంద్, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్ పై పటమట పీఎస్ లో సెక్షన్ 420,376,354(1),(2), 384, 506 , రెడ్ విత్ 34, 120 (బి) ఐసీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే  కొందరు ప్రజాప్రతినిధులు వదలాలంటూ పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మరికొందరు ఉన్నతస్థాయి అధికారులు కూడా పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చారంటే వీరినీచ దందా ఏవిధంగా సాగుతుందో అర్థమవుతోంది.  తీగ లాగితే తెలుగుతమ్ముళ్ల డొంకంతా కదులుతోంది. టీడీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేతల రాక్షసక్రీడపై నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరపించి, దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రజలు, మహిళాసంఘాలు, ప్రతి పక్షాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment