తాజా వార్తలు

Sunday, 13 December 2015

సల్లూబాయ్ ఊరికే బయటపడలేదట


హిట్ అండ్ రన్ కేసు నుంచి సల్మాన్ ఖాన్ ఊరికే బయటపడలేదని సల్మాన్ తండ్రి సలీంఖాన్ తేల్చిచెప్పారు. కేసునుంచి బయటపడటానికి సల్మాన్‌ఖాన్‌కు రూ.25 కోట్లపైనే ఖర్చు అయిందట. బాంబే హైకోర్టు గురువారం తన కుమారుడిని నిర్దోషిగా విడుదల చేయడం పెద్ద ఊరట నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు నుంచి సల్మాన్ సులభంగా బయటపడ్డారనే అభిప్రాయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సల్మాన్ కొన్నాళ్లపాటు జైలులో గడిపారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో సల్మాన్ రూ.25 కోట్లకు పైనే ఖర్చు చేశాడని సలీంఖాన్ తెలిపారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment