తాజా వార్తలు

Thursday, 3 December 2015

కెసిఆర్ ఆప్తుడితో చంద్రబాబు భేటీ-కారణం !

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సన్నిహితుడుగా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వరరావుతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతోంది.ఒకప్పుడు ఉప్పు,నిప్పుగా ఉన్న చంద్రబాబు,కెసిఆర్ లు ఇటీవలి కాలంలో కొంత స్నేహంగా ఉంటున్నారు.ఓటుకు నోటు కేసు ఒకవైపు , పోన్ టాపింగ్ కేసు మరో వైపు పెట్టుకుని హడావుడి చేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు అమరావతి శంకుస్థాపన నాటి నుంచి కలిశారు. తాజాగా కెసిఆర్ కూడా చంద్రబాబును చండీయాగానికి పిలవవచ్చని అంటున్నారు.ఈ నేపధ్యంలో టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు నాయుడు అక్కడే రామేశ్వరరావుతో భేటీ అవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కెసిఆర్ తరపున రామేశ్వరరావు ఏమైనా మాట్లాడారా?లేక రామేశ్వరరావు ద్వారా చంద్రబాబు ఏదైనా సందేశం పంపించారా అన్న చర్చ జరుగుతోంది.ఏమి మాట్లాడుకుంది ఎవరూ చెప్పరు కనుక ఎవరికి తోచిన ఊహాగానం వారు చేసుకోవచ్చు.
« PREV
NEXT »

No comments

Post a Comment