తాజా వార్తలు

Monday, 14 December 2015

ధనాధన్ విడుదలకు రెడీ

వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా థర్డ్ ఐ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ వారి బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ నిర్మించిన 'ధనాధన్' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. చిత్ర నిర్మాతలు డా|| శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని మాట్లాడుతూ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి తన ఉద్యోగం పోవడం వల్ల తన జీవితంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది.అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. తమిళ దర్శకుడు శంకర్ శిష్యుడు శ్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యస్ యస్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హై లైట్ గా నిలుస్తుంది.త్వరలోనే ఆడియోను సోని మ్యూజిక్ ద్వారా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కోటా శ్రీనివాసరావు,షియాజీ షిండే ముఖ్య ప్రతినాయకులుగా నటిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
వైభవ్, రమ్యా నంబీసన్,కోటా శ్రీనివాసరావు,షియాజీ షిండే, చార్లీ, ప్రవీణ్ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: ఎస్. ఎస్. తమన్, పాటలు:  డా||రాణిపులోమజాదేవి, మాటలు: శివ పార్వతి, కోరియోగ్రఫీ: అన్విత, శోభి, సతీష్, డి.ఓ.పి: ఎ. ఎం. ఎడ్విన్ సాకే, 
నిర్మాతలు: డా|| శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని,
కథ, దర్శకత్వం: శ్రీ
« PREV
NEXT »

No comments

Post a Comment