తాజా వార్తలు

Sunday, 13 December 2015

మూడు వేలకే డాటావిండ్ స్మార్ట్ ఫోన్

కేవలం మూడు వేలకే డాటావిండ్ స్మార్ట్ ఫోన్ లను లాంఛ్ చేసేందుకు రంగం సిద్ధంచేసింది. మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీ డాటావిండ్ త్వరలో అతి తక్కువ ధరలో, పలు ఆఫర్లతో 4జీ మొబైళ్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నది. వీటి ధర రూ.3,000గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్లకు ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. తాము 4జీ పరికరాల విషయమై పలు మొబైల్ ఆపరేటర్లతో మాట్లాడుతున్నామని, ఉచిత 2జీ, 3జీ నెట్ బ్రౌజింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఆర్‌కామ్, టెలినార్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని డాటావిండ్ ప్రెసిడెంట్, సీఈవో సునీత్ సింగ్ తెలిపారు.

« PREV
NEXT »

No comments

Post a Comment