తాజా వార్తలు

Saturday, 5 December 2015

తెలంగాణలో కరువు అంచనా వేయనున్న కేంద్రబృందాలు

రాష్ట్రంలో కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు ఇవాళ కేంద్ర బృందాలు రానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలల్లో పరిస్థితులను పరిశీలించడానికి మూడు బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. కరువు ప్రాంతాలలో కేంద్రబృందాలు ఇవాళ సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటాయి. అనంతరం సోమవారం ఉదయం పది గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో బృంద సభ్యులు సమావేశం కానున్నారు. తర్వాత జిల్లా పర్యటనకు వెళ్తారు. మొదటి బృందం సోమవారం నిజామాబాద్ జిల్లాకు వెళ్తుంది. రాత్రి అక్కడే బస చేసి మంగళవారం మెదక్ జిల్లాలో పర్యటించి హైదరాబాద్కు తిరిగివస్తుంది.  రెండవ బృందం సోమవారం మహబూబ్నగర్ జిల్లాకు వెళుతుంది. రాత్రి అక్కడే బసచేసి మంగళవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించి తిరిగి హైదరాబాద్కు చేరుకుంటుంది. మూడవ బృందం సోమవారం నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తుంది. రాత్రి వరంగల్లో బసచేసిమంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించి తిరిగి వస్తుంది.  జిల్లాల పర్యటన అనంతరం కేంద్ర కరువు బృందాలు... మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ను కలవనున్నాయి.  
« PREV
NEXT »

No comments

Post a Comment