తాజా వార్తలు

Monday, 7 December 2015

రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

మారిషస్ అధ్యక్షుడు డాక్టర్ బీబీ అమీనా ఫిర్దాస్ గురిబ్ ఫకిం హైదరాబాద్, సైబరాబాద్ నగరాలను సందర్శించనున్న నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ పరిమితులు, దారి మళ్లింపులు ఉండనున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.  ఈ విషయాన్ని నగర పౌరులు దృష్టిలో ఉంచుకొని రేపు(మంగళవారం), ఎల్లుండి(బుధవారం) సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మంగళవారం నాడు ట్రాఫిక్ మళ్లింపు ఉండే ప్రాంతాలు...రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి హోటల్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ వైపు ఉండే ప్రాంతాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంట మధ్య, హోటల్ ఫలక్ నుమా నుంచి గోల్కొండ వెళ్లే మార్గంలో మధ్యాహ్నం 2.45 నుంచి 3.30గంటల మధ్య, గోల్కొండ కోట నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ మార్గంలో సాయంత్రం 4.15 నుంచి 5.00 గంటల మధ్య, ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వెళ్లే మార్గంలో 6.30 నుంచి 19.15 గంటల మధ్య ట్రాఫిక్ పరిమితులు, దారి మళ్లింపులు ఉంటాయి.

బుధవారం నాడు ట్రాఫిక్ మళ్లింపు ఉండే ప్రాంతాలు..హోటల్ ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి చార్మినార్ వెళ్లే మార్గంలో ఉదయం 10.45 గంటల నుంచి 11.30 మధ్య, చార్మినార్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం దారిలో ఉదయం 11.30గంటల నుంచి 11.45 మధ్య, సాలార్జంగ్ మ్యూజియం నుంచి తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళ్లే మార్గంలో 12.15 నుంచి 1.00 గంటల మధ్య, ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో 3.45 నుంచి 4.30 మధ్యకాలంలో ట్రాపిక్ పరిమితులు, రహదారి మళ్లింపులు ఉంటాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment