తాజా వార్తలు

Monday, 7 December 2015

కొత్తగూడెంలో ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఫిబ్రవరి 4 తేదీ నుంచి 13 తేదీ వరకు ఆర్మీ రిక్రూర్ మెంట్ జరుగనున్నది. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనే నిరుద్యోగులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా యువజన సర్వీసులు, సెట్కం సీఈఓ మందపాటి పరందామరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్హతలు, శారీరక కొలతల ఆధారంగా సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్, సో ల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్, సోల్జర్ ట్రేడ్స్మ్యాన్ కేటగిరీలలో ఉద్యోగ అవకాశాలున్నాయన్నారుఈనెల 21నుంచి జనవరి 19 వరకు WWW.JOININDIANARMY.NIC.IN వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అభ్యర్థి అఫ్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆన్లైన్ సూచనలు, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణాలోని 10జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువకులకు అవకాశం ఉందన్నారు. వివరాలకు 984991306 8, 08742-248663లలో సంప్రదించాలని కోరారు. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

« PREV
NEXT »

No comments

Post a Comment